Friday, August 14, 2020

కేర్ ఆఫ్ కంచరపాలెం,- సిల్లు కరుపట్టి -వరనే అవశ్యముండ్- షర్తో లగూ

 ఈ మధ్య వచ్చిన నాలుగు ప్రాంతీయ భాషాచిత్రాల గురించి

కేర్ ఆఫ్ కంచరపాలెం,- (2018) తెలుగు
సిల్లు కరుపట్టి -(2019) తమిళ్
వరనే అవశ్యముండ్ (వరుడు కావాలి- 2020) - మళయాళం
షర్తో లగూ (షరతులు వర్తిస్తాయి- 2018)- గుజరాతి
ఈ నాలుగు సినిమాలలోనూ కామన్ పాయింట్లు ఉన్నాయి. ఒకప్పుడు తెరపైకి రాని విషయాలను, వచ్చినా అదొక అసాధారణ విషయమైనట్టు చెప్పబడేవి. అలాంటి విషయాలు ఇప్పుడు చాలా సహజమైనవాటిగానే ప్రెజెంట్ చేయబడుతున్నాయి. ఈ సినిమాల్లో బాగోగులు, మంచి చెడుల గురించి కాక కథాంశం గురించే కొన్ని మాటలు
*****
కేర్ ఆఫ్ కంచర పాలెంలో నాలుగు జంటలమధ్య ఇష్టం/ప్రేమ- దాని పర్యవసానం కథాంశం **ఎలిమెంటరీ స్కూల్ విద్యార్ధి, క్లాస్ మేట్ అమ్మాయిని ఇష్టపడుతుంటాడు. ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కూతురు స్కూల్ లో మర్యాదకరంగా లేని పాట పాడుతుందని స్కూల్ మానిపించి వేరే వూరి పంపించేసాడు.
** కాలేజీలో చదివే హిందూ అమ్మాయి, రౌడీగా తిరుగుతున్న క్రిస్టియన్ అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆ అమ్మాయి తండ్రి బలవంతంగా ఆ అమ్మాయి పె ళ్ళి వేరే వానితో చేసేసాడు.
** లిక్కర్ షాప్ లో పనిచేసే అబ్బాయి, రోజూ ఆ షాపుకు ముసుగు కప్పుకు వచ్చి మద్యం బాటిల్ కొనుక్కెళ్ళే అమ్మాయిని, ఆమె వేశ్య అని తెలిసీ ప్రేమించాడు. ఆ అమ్మాయి ముస్లిం మతస్తురాలు. ఆ మతానికి చెందిన మిగతావారు అభ్యంతరపెట్టటంతో ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది.
**ఒరిస్సాకు చెందిన ఒకామె అధికారిణిగా ఆఫీసు కు వచ్చింది. ఆమె సింగిల్ పేరెంట్. కూతురు కాలేజిలో చదువుతుంది. బి.పి, సుగర్ వంటి ఆరోగ్యసమస్యలున్నాయి. ఆమె తన అఫీసు లో అటెండర్ గా ఉన్న యాభైయేళ్ళ అవివాహితుణ్ణి ఇష్టపడింది. ఇద్దరూ పె ళ్ళి చేసుకుందామనుకున్నారు. ఆమె కూతురు మొదట అభ్యంతర పెట్టినా తర్వాత తనకు కాబోయే తండ్రిని ఒంటరిగా కలిసి ప్రశ్నించి, తన సమ్మతిని తెలిపింది. ఐతే ,అధికారిణి సోదరునికి ఆ పె ళ్ళి ఇష్టం లేదు. అన్న నిర్భందం నుండి తప్పించుకుని అధికారిణి, అటెండరును పె ళ్ళి చేసుకుంది.
************
సిల్లు కరుపట్టి సినిమాలోనూ నాలుగు ప్రేమకథలున్నాయి.
** ‘ పింక్ బాగ్’- డంప్ యార్డ్ లో ఉపయోగపడే వస్తువుల్ని సేకరించుకే కుర్రవాడికి, అక్కడికి వచ్చే ‘ వేస్ట్ ‘ ను జెనరేట్ చేసే గేటెడ్ కమ్యూనిటీ లో ఖరీదైన అపార్ట్ మెంట్లో ఉండే అమ్మాయికి ’ వేస్ట్ బ్యాగ్’ (పింక్ బాగ్) సమాచార సాధనంగా మారటం ఒక కథ. పిల్లలవయసు సుమారు పది సంవత్సరాలు.
** ఉద్యోగం తో పాటు టివీలో యు ట్యూబ్ లో షోలు (మీమ్స్) చేస్తుండే యువకుడు తనకు కాన్సర్ వ్యాధి ఉందని తెలుస్తుంది. ఫాషన్ డిజైనర్ ఐన ఓ అమ్మాయి అతనితో అద్దె కారు షేర్ చేసుకుంటూ ఉంటుంది. అతని ఆరోగ్య సమస్య తెలుసుకుని సానుభూతి చూపుతుంది. వారి మధ్య ప్రేమపుడుతుంది.
** ‘హే అమ్ము’- వీరి వివాహమై పన్నెండేళ్ళయ్యింది.జీవితంలో మధురిమ అదృశ్యమయ్యింది. వారిమధ్య మిస్సైన కమ్యూనికేషన్ ‘ అలెక్సా’ ద్వారా తిరిగి వచ్చింది. మరొకసారి ఒకరిలోఒకరు కొత్తదనాన్ని చూసారు.
**’టర్టిల్ వాక్’ - అతను భార్యను కోల్పోయి ఒంటరిగా జీవన మలిసంధ్యలో ఉన్నాడు. అవివాహితగానే ఆమె జీవితం గడచిపోయింది. ఒకరి సాహచర్యన్ని మరొకరు కోరుకున్నారు.
******* *******
‘వరనే అవశ్యముండ్.’
‘నిక్కి ‘ అనే అమ్మాయి వరునికోసం మాట్రిమోనియల్ పోర్టల్ ద్వారా ప్రయత్నిస్తుంటుంది. ఆమె సంబంధం విషయంలో చాలా పట్టింపులున్నాయి. చివరకు అంతకు మునుపే పరిచయమున్న వ్యక్తిని ఎంచుకుంది. ఆ వ్యక్తితో పాటు అతని తల్లికూడా నిక్కి కి దగ్గరయ్యింది.
ఐతే తనకు వరుణ్ణీ ఎంచుకున్నాక నిక్కి తల్లి ‘నీనా’ వైపు నుండి సమస్య ఎదురయ్యింది. సింగిల్ పేరెంట్ గా ఉన్న ‘ నీనా’ పొరుగు అపార్ట్మెంట్ లో ఉన్న అవివాహిత రెటైర్డ్ మేజర్ తో స్నేహం చేస్తుంది. వివాహం చేసుకునే ఉద్దేశం ఉంది. ఇది తెలిసిన ‘నిక్కీ’ వరుడు ఆమె కు దూరమయ్యాడు. కొంత మానసిక సంఘర్షణ తరువాత నిక్కీ తల్లి స్నేహితునితో మాట్లాడి వారి అనుబoధానికి తన అంగీకారం తెలిపింది. తను మరోవరుణ్ణి ఎంచుకుంది.
***********
‘ షర్తో లగు’
ఆమె జంతువుల పట్ల అమిత ప్రేమకలిగిన వెటర్నరీ డాక్టర్.తను ఎక్కబోయే ఆటో డ్రైవర్ సైతం ‘ వెగన్’ ఐఉండాలని చూస్తుంది. అతడు పర్యావరణం పై శ్రద్ధ వహించే ఇంజనీర్. సోలార్ పవర్ కు సంబంధించిన వ్యాపారంలో ఉన్నాడు. మాంసాహారాన్నిఅమితంగా ఇష్టపడతాడు. వీరిద్దరికీ పెద్దలు వివాహ ప్రయత్నం చేస్తారు. ఐతే ఆమె ఒక షరతు పెట్టింది. కాబోయే భార్యాభర్తలు ఒకే ఇంట్లో రెండు నెలలు గడిపిన తర్వాత ఒకరికొకరు నచ్చితే పె ళ్ళి చేసుకోవాలి. కష్టం మీద పెద్దలందరూ దీనికి ఒప్పుకున్నారు. ఇందుకు ఏ మాత్రం అభ్యంతరం పెట్టని వ్యక్తి పె ళ్ళికొడుకు నాయనమ్మ. ఆధునికురాలైన ఆమె 75యేళ్ళ వయసులో కొ డుకు కన్ను కప్పి రాత్రిళ్ళు తన బాయ్ ఫ్రెండ్ తో షికార్లు చేస్తుంది. ఇంట్లోకి కిటికీ గుండా ప్రవేశిస్తుంది. మనుమడి పె ళ్ళికన్నా ముందే తన బాయ్ ఫ్రెండ్ ను వివాహo చేసుకుని ఇంటికి తీసుకు వస్తుంది.

No comments:

Post a Comment

కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 3)

  కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 3) కొన్ని సినిమా కథలు సినిమాగా వచ్చాక పుస్తక రూపం లో ‘సినిమా నవల’ పేరుతో వచ్చాయి. పరిమాణం లో అవి చిన్న...