Friday, August 14, 2020

అయ్యప్పనుమ్-కోషియుమ్ (2019 సినిమా)

 నాకు ఆసక్తి కలిగించిన మాలయాళి దర్శకులలో ఆదూర్ గోపాలకృష్ణన్, భరతన్,ఫాజిల్, ప్రియదర్శన్ లు ముఖ్యులు. ఇటివలికాలంలో 'సాచీ '(సచ్చిదానంద్) పట్ల అలాంటి ఆసక్తి ఏర్పడింది.. దర్శకునిగా, రచయితగా అతని చేసినసినిమాలలో అతనిదైన ముద్ర కనిపిస్తుంది. 48 యేళ్ళ చిన్నవయసులోనే జూన్ 18 న అతను మరణించాడు.

అనేకమందిని ఆకర్షించిన అతని ఇటివలి సినిమా ‘అయ్యప్పనుమ్-కోషియుమ్ ‘ దానిని పోలిన ఒక హిందీ సినిమా ‘టాక్సి నె. 2911’ గురించి కొద్ది మాటలు.
******
హిందీలో టాక్సి నెం. 9211 (2006) అనే సినిమా వచ్చింది. అందులో ప్రధాన పాత్రలు రెండు సినిమామొత్తం సంఘర్షిస్తూనే ఉంటాయి. అవి పరస్పరహనాన్ని ఉద్దేశిస్తూ స్యయం హననానికి కూడా వెనుకాడవు.ఒకపాత్ర భార్యకు ఇన్సూరెన్స్ కంపనీ ఏజెంటునని అబద్దంచెపుకునే టాక్సీ డ్రైవరు , మరొకపాత్ర ఒక శ్రీమంతుని దారితప్పిన కొడుకు. ఇద్దరికీ ఇబ్బందులు ఉన్నాయి,మానసిక సంఘర్షణ ఉంది. దాని వ్యక్తీకరణ లో తీవ్రత ఉంది. ప్రేక్షకునికి ఆ పాత్రలపట్ల, వాటి బలహీనతలపట్ల కొన్నిసార్లు కోపంకలుగుతుంది ,మరికొన్ని సార్లు సానుభూతి కలుగుతుంది. పాత్రల ఆర్ధిక, సామాజిక నేపధ్యాల వైరుధ్యాలను ఒక్కొక్కటిని తొలగించుకుంటూపోతూ చివరికి వారిద్దరూ ప్రవర్తనకూ మూలం ఒక్కటేనని తేలుస్తాడు దర్శకుడు. ప్లాట్ పరంగా సినిమాకు వేరే ఇంగ్లీష్ మూలమున్నా పాత్రలు జీవంతో తీర్చిదిద్దబడ్డాయి.
********
అయ్యప్పనుమ్-కోషియుమ్ సినిమాలో రెండు ప్రధానపాత్రలు- అయ్యప్పన్ నాయర్ అనే చిన్నపోలీస్ అధికారి, కోషి కురియన్ అనే మాజీ సైనికుడు.పోలీస్ అధికారి రెటైర్మెంటుకు దగ్గర ఉన్నాడు.మాజీ సైనికుడు ధనవంతుని కొడుకైనా గౌరవంకోసం సైన్యంలో పనిచేసివచ్చాడు.
వారిద్దరిమధ్యా ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో తప్పుచేసిన మాజీ సైనికుని పైన పోలీస్ చేయిచేసుకున్నాడు.చేసిన నేరానికి శిక్షను అనుభవించిన మాజీ సైనికుడు పోలీస్ పైన పగబట్టాడు.అపసవ్య మార్గంలో అతడ్ని ఉద్యోగానికి దూరం చేసాడు.ఉద్యోగం పోగొట్టుకున్న పోలీస్, మాజీ సైనికుడ్ని సాధించేందుకు కంకణం కట్టాడు.
ఒకరినొకరు గెలిచేక్రమంలో చాలా పోగొట్టుకున్నారు.తమ సొంతబలమనుకున్నవి ఒక్కొక్కటి తమనుంచి దూర మయ్యాయి. యి. చిట్టచివరకు నిజమైన 'నేను 'లు బాహాబాహీ తలపడ్డ్డారు. అప్పుడు వారిద్దరూ సమతల ఆటస్థలంలో ఉన్నారు. ఆట కూడా సమానమయ్యింది.
అప్పటిదాకా ఆటస్థలం అయ్యప్పన్ సంబంధించిన ప్రాంతంలో సాగింది. ముగింపులో అయ్యప్పన్ బదిలీతో అది కోషీ సొంతవూరికి మారింది.
********
అయ్యప్పనుం కోషియుం సినిమా ప్లాట్ ఇద్దరు వ్యక్తుల అహం కు సంబంధించిన ఘర్షణ గా అనుకుంటే సినిమాలో ప్రత్యేకత ఏమీఉండదు. అలాంటి ప్లాట్ తో వచ్చిన సినిమాలు లెక్కకుమిక్కిలి ఉన్నాయి. టాక్సి నె.2911 ఒక ఉదాహరణ. మిగతా సినిమాలకంటే ఈ సినిమా ఎలా భిన్నమైనది?
సినిమాలో ప్రధానపాత్రల్ని ఆవరించుకున్న ఎన్విరాన్ మెంట్ లో సహజత్వం ఉంది. ఆ ఎన్విరాన్ మెంట్ లో అనేకపొరలున్నాయి.
ఆర్ధికపరమైన ఉన్నతి చెప్పరాని ధైర్యాన్నిస్తుంది. కులంద్వారా, మతం ద్వారా సంక్రమించిన సామాజికపరమైన హోదా మనిషి బలాన్ని పెంచుతుంది.అలాగే స్థానికత కూడా.
వ్యక్తికి సమాజంలో ఉన్న సెలబ్రీటీస్ తో ఉన్న పరిచయాలు, ఆర్ధికస్తితి,కులం, మతం, రాజకీయసంబంధాలు అనేక పొరలుగా వ్యక్తులకు కవచాల్లా అంటుకుని ఉంటాయి.
మాజీ సైనికుడు 'కోషీ కురియన్ ' త్రిశ్శూర్ కి చెందిన సిరియన్ క్రిస్టియన్. అతని తండ్రి రాజకీయంగా , ఆర్ధికంగా,సామాజికంగా ఉన్నతమైన సోషల్ స్త్రేటా కు చెందినవాడు.పరువు,కుటుంబగౌరవం కోసం ఏదైనా చేయగలవ్యక్తి.
పోలీస్ అధికారి తండ్రి 'నాయర్ 'కులస్తుడు (హిందూ మతస్తుడు?). వేరేకులానికి చెందిన అతనితల్లి కొడుకుకు కొంత రక్షణ ఏర్పడుతుందని అతని పేరు అయ్యప్పన్ నాయర్ అని పెట్టింది. దానికారణంగా 'కోషి ' అయ్యప్పన్ ను 'నాయర్ కొడుకా ' అని వ్యంగంగా సంబోధించగలుగుతున్నాడు. అతనిది ఆర్ధికంగా చిన్నస్థాయి. భార్య ఆదివాసి. పోలీస్ ఆఫీసర్ కు బలం పోలీస్ గా సంక్రమించిన అధికారం, రెండోవ్యక్తి చేసిన నేరం. మాజీసైనికుని బలాలన్నీ పోలీస్ ఆఫీసర్ బలహీనతలు.
*******
సాచీ రచన తో వచ్చిన మరో సినిమా డ్రైవింగ్ లైసెన్స్ లోనూ ఇద్దరు వ్యక్తుల అహానికి సంబంధించిన పోరు ఉంటుంది. ప్రభుత్వోద్యోగికి , సినిమా నటునికి మధ్యకొన సాగిన ఘర్షణలో పా ర్శ్వాలు పరిమితమైనవి.ఒకరకంగా డ్రైవింగ్ లైసెన్స్ సినిమా అయ్యప్పనుం కోషియుం సినిమాకు రెహార్సిల్ లా అనిపిస్తుంది.
************

No comments:

Post a Comment

కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 3)

  కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 3) కొన్ని సినిమా కథలు సినిమాగా వచ్చాక పుస్తక రూపం లో ‘సినిమా నవల’ పేరుతో వచ్చాయి. పరిమాణం లో అవి చిన్న...