Showing posts with label jagte raho. Show all posts
Showing posts with label jagte raho. Show all posts

Friday, August 14, 2020

చిప్పా! ( 2018/20) - జాగ్తే రహో( 1956)

 చిప్పా! ( 2018/20) - జాగ్తే రహో( 1956)

చిప్పా!
కథానాయకుడు పదేళ్ళ ‘చిప్పా’ ఒక పెద్దామె సంరక్షణ(?) లో ఉన్నాడు. ఆ పెద్దమె, కలకత్తా ఫుట్ పాత్ పైన తినుబండారాలు చేసి అమ్మతుంటుంది. వారిరువురి నివాసమూ ఫుట్ పాత్ పైనే. పనిపాటల్లో చిప్పా తనకు సాయపడటంలేదని ఆమె ఫిర్యాదు. చిప్పా తల్లి మరణించింది, తాగుబోతు తండ్రి కొడుకుని వదిలేసి ఓ బెంగాలీ యువతితో వెళ్ళిపోయాడు.
తనెప్పుడూ చూడని తండ్రి రాసిన ఉత్తరం చిప్పా కు అందింది. అది చిప్పా పదేళ్ళు నిండాక చదవాలి. ఐతే అది ఉర్దూలో రాసిఉంది. చిప్పా ఉర్దు తెలియదు.
పదోపుట్టినరోజు రాత్రి చిప్పా తన సామాన్లు చిన్న స్కూల్ బాగులో సర్దుకుని తన లావాటి పర్సు తీసుకుని యాత్రకు బయలుదేరాడు.చిప్పా ప్రధానఉద్దేశం తండ్రి ఉర్దూ లో రాసిన ఉత్తరంలో ఏముందో తెలుసు కోవటం.
తన రాత్రి యాత్రలో చిప్పా కొందరిని కలిసాడు. కారు పై భాగంలో గార్డెన్ ఏర్పాటుచేసుకున్న టాక్సి డ్రైవరు, తనను సురక్షిత ప్రాంతంలో వదిలిన దయగలిగిన పోలీసు, ఓ మిఠాయి బండారు యజమాని, రాత్రి రెండుగంటలవేళ భోజనాలు తింటున్నబాండ్ మేళం ట్రూప్, కొట్టవచ్చిన తాగుబోతు, తీవ్ర నిరాశానిస్పృహతో ‘బార్’ మూసేసేదాకా తాగిఉన్న ధనిక యువకుడు, భవననిర్మాణ బాల కార్మికులు,వార్తాపత్రికలు చేరవేసే వారు...వీరందరితో సంభాషించాడు. వారిలో చాలామందిలో తన భవిష్యరూపాన్ని చూసుకున్నాడు.ఐతె వీరెవ్వరికీ ‘ఉర్దూ’ చదవటం రాదు. మధ్యలో అతనికి ఓ కుక్క తోడయ్యింది. రాత్రి ముగుస్తున్న సమయంలో తన అవసరం తీర్చగల వ్యక్తిని అతడు కలుసుకున్నాడు. ఉర్దూ పేపర్లు అమ్మే ఆ వ్యక్తికి చిప్పా తన ఉత్తరాన్ని ఇచ్చి చదివిపెట్టమన్నాడు.ఆవ్యక్తి ఉత్తరాన్ని, చిప్పా ను మార్చి మార్చి చూసాడు. ఉత్తరంలోని రాత వెలిసిపోయిందని చదవలేమని చెప్పాడు. ఐతే చిప్పా కు తనకు సహాయకుడుగా ఉండమని , తనతో పాటు తన ఇంటిదగ్గరే ఉండవచ్చని ఒక ఆఫరు ఇచ్చాడు. అతని ఇంటికి వెఌన చిప్పాకు మంచిస్వాగతం లభించలేదు. ఇతని రాక ఆ భార్యాభర్తలమధ్య మరింత చిచ్చురేపింది. ఎనిమిదేళ్ళనుండీ అతనితో ఎలామోసపోయిందో ఆ బెంగాలీ యువతి అరుస్తూచెబుతుంది. అక్కడనుండి బయటపడ్డ చిప్పా ను ఒక షాపు యజమాని దొంగగా ఆరోపిస్తూ మందితో కలిసి గాయపరచాడు. రాత్రి కలసిన పోలీస్ మౡ చిప్పాను చూసాడు.యాత్ర ముగిసిందా అనిప్రశ్నించిన పోలీసుకు యాత్ర ఇప్పుడే మొదలయ్యిందని చిప్పా సమాధానమిచ్చాడు. కుక్కతో పాటు ఇంటికి చేరిన చిప్పా పట్ల పెద్దామె ఎంతో ఆదరం చూపింది.
*****
సినిమా మొత్తం చిప్పా దృష్టికోణం నుండి సాగుతుంది.అతని నడక, మాట, కళ్ళలోని మెరుపు..ఎంతో కాన్ఫిడెన్స్ తోనూ, ఆశాభావంతోనూ కూడిఉంటాయి.ప్రతీపనిని, ప్రతీవృత్తిని ఆరాధనాభావంతో చూస్తాడతను. ఒంటరితనం ఒక్కోసారి అతనికి భీతిని కలుగజేస్తుంది. కదలివెళ్ళే గుంపుతో అన్నీమరచిపోయి కలిసిపోతాడు. నీలో నా బాల్యాన్ని చూస్తున్నానని టాక్సి డ్రైవరు చెబితే నీలో నా భవిష్యత్తును చూస్తున్నానని అంటాడు.
*******
జాగ్తే రహో (1956)
ఈ సినిమాలో రాజ్ కపూర్ కథానాయకుడు. ఆ సినిమాకు చిప్పాకు పోలికలూ అందులోనే వైరుధ్యాలూ ఉన్నాయి. జాగ్తే రహో సినిమా ‘చిప్పా’ లానే ఒక్కరాత్రి లో సాగుతుంది. రెండింటి కథాస్థలం ‘కలకత్తా’ మహానగరమే. పల్లెటూరి వ్యక్తి నగరానికి వస్తాడు. అతని దృష్టికోణం నుండి కథనడుస్తుంది. దాహం తీర్చుకోవటానికి ఒక అపార్ట్మెంట్ లోకి ప్రవేశిస్తాడు. అతన్ని దొంగగాభావించి అందరూ వెంటాడతారు. అతను తప్పించుకునేప్రయత్నంలో ఎంతో గౌరవప్రదంగా కన్పించే ఆ అపార్ట్మెంటుళ్ళోని వ్యక్తుల్లో చీకటికోణాలు గమనించాడు.చట్టవ్యతిరేక, నీతిబాహ్య చర్యలు, కర్కశ, విపరీత మానసిక ప్రవృత్తులు..వీటన్నింటిని అపార్ట్మెంటులో నివసించేవారిలో గమనించాడు. ఆ రాత్రంతా గడచినా అతని దాహం తీరలేదు.
*********
‘జాగ్తే రహో ‘ సోషలిస్ట్ భావధోరణి తో సాగుతుంది. (కథారచనలో కె.ఎ. అబ్బాస్ సహాయం ఉంది),పేద, ధనిక అంతరాలను చర్చిస్తుంది.
‘చిప్పా’ సినిమా లో మతపరమైన అంశం ఉంది. ప్రాభవం తగ్గిన మతానికి చెందిన సమాజపు ప్రస్తుతస్థితిని చూపేప్రయత్నం ఉంది. ‘ఉర్దూ తెలిసి ఉండటం’ అనేదాన్ని అందుకు ప్రతీకగా తీసుకున్నారనిపిస్తుంది. ఉర్దూ పేపర్ చదివే వారి ఇళ్ళస్థితి అలానే చూపబడింది.
*********
** చిప్పా కు మిఠాయి భండారు యజమాని తన పూర్వీకుల గొప్పదనం చెప్పేక్రమంలో తన ముని తాతమ్మ తనచేతిలో కొబ్బరికాయను లాక్కెళ్ళబోయిన కోతిని ఎలా కొట్టిందో చెబుతూ ఆ కోతిని ‘హనుమాన్’ అని రిఫర్ చేస్తూ తిరిగి తిరిగి చెబుతాడు.అదే సమయంలో ఆ భవనం పైన కాషాయజెండాలు, ఒక కోతి కనిపిస్తాయి.
***ఒక తాగుబోతు చిప్పా ను మందు బాట్ల్ తో కొట్టబోతూ ‘నిన్నుకాదు ఫలానా రాజకీయ నాయకుడ్డి తల పగలకొడతాను’ అంటాడు.
*** చిప్పా తన రాత్రి యాత్రముగించుకుని ఒక షాప్ మెట్లమీద కూర్చున్నాడు. షాపు యజమాని హనుమాన్ చాలీసా చదువుకుంటు వచ్చి ;చిప్పా’ ను చీదరించుకుంటాడు. అతన్ని దొంగగా తీర్మానించి గాయపరుస్తాడు.
ఇవిలేకున్నా సినిమా వాసి తగ్గి ఉండేదికాదు.
************************************
-ముళ్ళపూడి సుబ్బారావు

కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 3)

  కన్యాశుల్కం – నాటకం –సినిమా ( భాగం 3) కొన్ని సినిమా కథలు సినిమాగా వచ్చాక పుస్తక రూపం లో ‘సినిమా నవల’ పేరుతో వచ్చాయి. పరిమాణం లో అవి చిన్న...